తెలంగాణలో రాహుల్ గాంధీ పర్యటన ఖరారు

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన ఖరారైంది. రెండు రోజుల పాటు ఆయన రాష్ట్రంలో పర్యటించనున్నారు. మే 4, 5 తేదీలలో తెలంగాణలో పర్యటిస్తారని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తెలిపింది. ఈ మేరకు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి సమాచారం అందింది. తెలంగాణ ప్రభుత్వ ప్రజా, రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా వరంగల్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని పీసీసీ నిర్ణయించింది. ఈ నెల 28, 29 తేదీల్లో ఈ సభను ఏర్పాటు చేస్తున్నామని ఇందుకు ముఖ్య అతిథిగా హాజరు కావాలని ఇటీవల రాహుల్‌గాంధీతో ఢల్లీిలో జరిగిన రాష్ట్ర ముఖ్య నేతల సమావేశంలో రేవంత్ రెడ్డి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజుల్లో రాహుల్ బిజీగా ఉండడంతో వచ్చే నెల 4, 5 తేదీలో పర్యటిస్తారని అధికారిక సమాచారం అందినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.