Kishkindhapuri: ‘కిష్కింధపురి’ చాలా ఎంగేజింగ్ హారర్ మిస్టరీ థ్రిల్లర్ : డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మిస్టీరియస్ అకల్ట్ థ్రిల్లర్ ‘కిష్కింధపురి’ (Kishkindhapuri). అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran) హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై అంచనాలు పెంచింది. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
ఈ ప్రాజెక్టు ఎలా స్టార్ట్ అయింది?
-నా ఫస్ట్ సినిమా చావు కబురు చల్లగా. ఆ సినిమా తర్వాత గీత ఆర్ట్స్ లోనే మరో సినిమా చేయాలి. అయితే కొన్ని కారణాల వల్ల డిలే అయింది. ఒక సందర్భంలో నిర్మాత సాహు గారికి ఈ కథ చెప్పాను. ఆయనకి చాలా నచ్చింది. తర్వాత బెల్లంకొండ శ్రీనివాస్ గారు విన్నారు. ఆయన చాలా ఎక్సైట్ అయ్యారు. అందరికీ కథ నచ్చడంతో ప్రాజెక్ట్ ని మొదలుపెట్టాం.
హారర్ సినిమానే చెప్పాలని ఎందుకు అనిపించింది?
-నాకు హారర్ సినిమా చాలా ఇష్టం, ఆ జానెర్ కి ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. హారర్ ని ఇష్టపడే ఆడియన్స్ కి నచ్చేలా ఒక కథ చేయాలని ఎప్పటినుంచో ఉండేది. కిష్కిందపురి హారర్ మిస్టరీ రెండు బ్లెండ్ అయిన సినిమా. ఇందులో ఎడ్జ్ అఫ్ ది సీట్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ చాలా వున్నాయి.
-ఆడియన్స్ కి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఈ సినిమా చేయడం జరిగింది. నాకు ప్రతి సినిమాలో ఒక కొత్త విషయాన్ని చెప్పాలని ఆలోచన ఉంటుంది. నాకు తొలి సినిమాలో కూడా చాలా వైవిధ్యమైనటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ఈ సినిమా కూడా హారర్ లో ఒక కొత్త అనుభూతిని అందించబోతుంది. చాలా ఇంపార్టెంట్ విషయాన్ని ఈ సినిమాతో చెబుతున్నాం.
ఈ కథ విన్న తర్వాత సాయి శ్రీనివాస్ గారు ఎలా రియాక్ట్ అయ్యారు?
-ఈ కథ ఆయనకు చాలా నచ్చి. సాయి గారు యాక్షన్ హల్క్ హీరో. ఆయన ఈ కథ విని ఉన్నది ఉన్నట్లుగా తీయమని చెప్పారు. మేము ఏదైతే అనుకున్నామో అది స్క్రీన్ మీదకి అద్భుతంగా వచ్చింది. కథ, విజువల్, టెక్నికల్ గా ఆడియన్స్ కి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని సాయి గారు మొదటి నుంచి నన్ను చాలా సపోర్ట్ చేశారు.
కిస్కిందపురి టైటిల్ జస్ట్టిఫికేషన్ ఏమిటి?
-కిష్కింధపురి అంటే మనకి రామాయణం గుర్తొస్తుంది. ఈ కథకి స్ఫూర్తి రామాయణం. అయితే ఆ స్ఫూర్తి చాలా మెటాఫర్ గా వుంటుంది. ఈ సినిమాని డీ కోడ్ చేసుకున్న వారికి రామాయణం నుంచి చాలా రిఫరెన్స్ దొరుకుతాయి.
అనుపమ క్యారెక్టర్ గురించి?
అనుపమ ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ చేశారు. ఇందులో హీరో హీరోయిన్ క్యారెక్టర్స్ నేను చూసిన రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఇన్స్పిరేషన్ గా తీసుకున్నాను. ఇద్దరు కూడా కొత్తగా కనిపిస్తారు.
-ఈ సినిమా అంతా కూడా ఒక తెలియని ప్లేస్ లో జరుగుతుంది. అందుకే చాలావరకు పెక్యులర్ గా ఉండే క్యారెక్టర్స్ ని తీసుకోవడం జరిగింది.
ఈ సినిమా కోసం పెద్ద సెట్ వేసినట్లుగా ఉన్నారు?
-ఒక రేడియో స్టేషన్ కి వెళ్లడం వల్ల జరిగిన కథ ఇది. రేడియో స్టేషన్ లో చాలా మ్యాసివ్ గా ఉండాలి. అలాగే ఈ కథ 1989లో మొదలవుతుంది. అలాంటి ఒక వింటేజ్ వైబ్ ని క్రియేట్ చేశాం. ఈ సినిమాలో కనిపించే లొకేషన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సినిమా త్రూ అవుట్ పరిగెడుతూనే ఉంటుంది. కథలో చాలా యాక్షన్ ఉంది.
సాహు గారి సపోర్ట్ ఎలా ఉంది?
ఈ కథ విన్న దగ్గర నుంచి ఇప్పటివరకు మేము ఏది కావాలంటే అది సమకూర్చారు. సినిమాకి కావలసిన ప్రతిదీ ఎక్కడ రాజీ పడకుండా ఇచ్చారు.
సెన్సార్ రిపోర్టు ఏమిటి?
-చాలా రోజుల తర్వాత ఒక మంచి హారర్ మిస్టరీ సినిమా చూసామని చెప్పారు. కొన్ని సీక్వెన్స్ చాలా భయంగా అనిపించాయి, మేం భయపడితే పిల్లలు కూడా భయపడతారు కదా అని ‘ఏ’ ఇచ్చారు. ఈ సినిమాలో ఒక్క స్మోకింగ్, డ్రింకింగ్ షాట్ ఉండదు. ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన క్లీన్ సినిమా ఇది.
మ్యూజిక్ గురించి?
-చేతన్ మ్యూజిక్ అదరగొట్టాడు. మూడు పాటలు అద్భుతంగా చేశాడు. ఆర్ఆర్ తో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాడు.
సాయి అనుపమ కాంబినేషన్లో వచ్చిన రాక్షసుడు సూపర్ హిట్ కదా.. మరి ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా?
-మేమైతే కాన్ఫిడెంట్ గా ఉన్నాం. ఒక సెన్సిబుల్, మంచి సినిమా చేశామని నమ్మకం ఉంది. కచ్చితంగా వర్కౌట్ ఉందనే వర్క్ అవుట్ అవుతుందనే నమ్ముతున్నాం. అవుట్ ఫుట్ చూసుకున్నాక చాలా హ్యాపీగా ఉన్నాం. టెక్నికల్ సినిమా టాప్ నాచ్ ఉంటుంది. గ్రాఫిక్స్ చాలా అద్భుతంగా వచ్చాయి.
కొత్తగా చేయబోయే సినిమాలు గురించి?
-రెండు కథలు సిద్ధంగా ఉన్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. ఈ సినిమా రిలీజ్ తర్వాత వాటి గురించి తెలియజేస్తాం.