Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)కి వ్యతిరేకంగా దాఖలైన పరువునష్టం దావా కేసును సుప్రీంకోర్టు (Supreme Court) కొట్టివేసింది. తెలంగాణ బీజేపీ (BJP) దాఖలు చేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఎన్నికల్లో గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారంటూ రేవంత్ రెడ్డి ప్రచారం చేయడంపై బీజేపీ పిటిషన్ దాఖలు చేసింది. గత నెలలో ఇదే విషయమై ఆ పార్టీ వేసిన పిటిషన్‌ను హైకోర్టు(High Court) కొట్టివేసింది. ఈ ఉత్తర్వులను బీజేపీ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. తాజాగా వాదనలు విన్న సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ (BR Gavai) ధర్మాసనం పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. రాజకీయపరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని తేల్చి చెప్పింది. రాజకీయ నాయకులకు సున్నితమైన మనసు ఉండకూడదని పేర్కొంది. కోర్టులను రాజకీయ యుద్ధ క్షేత్రాలుగా మార్చవద్దని వ్యాఖ్యానించింది.