Minister Ponnam: తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష : మంత్రి పొన్నం

తెలంగాణలో ఎరువుల కొరతతో రైతులు ఆందోళనలో ఉన్నారని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎరువుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపించారు. ఎరువుల తయారీ, సరఫరాపై పూర్తి ఆధిపత్యం కేంద్రానిదే. కేంద్రం మన రాష్ట్రంపై వివక్ష చూపిస్తోంది. రైతుల్లో రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకత రావాలనేది వారి ఉద్దేశం. బీజేపీతో బీఆర్‌ఎస్ కుమ్మక్కై ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో ఎరువుల సమస్య ఉందనేది వాస్తవం. ఈ సమస్యకు బాధ్యత వహించాల్సిన వాళ్లు నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నారు అని మంత్రి ధ్వజమెత్తారు.