BRS: ఉపరాష్ట్రపతి ఎన్నికకు బీఆర్‌ఎస్ దూరం

ఉప రాష్ట్రపతి ఎన్నికకు దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్ (BRS) నిర్ణయం తీసుకుంది. బీజేపీ(BJP) , కాంగ్రెస్ పార్టీలకు సమాన దూరంలో ఉన్నందున ఈ పోలింగ్‌కు దూరంగా ఉండాలని పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నిర్ణయం తీసుకున్నారు. ఉపరాష్ట్రపతి పోలింగ్ మంగళవారం జరగనుంది. ఎన్డీయే అభ్యర్థిగా సీపీ రాధాకృష్ణన్ (CP Radhakrishnan) పోటీపడుతుండగా, విపక్ష కూటమి తరపున తెలంగాణకు చెందిన జస్టిస్ సుదర్శన్‌రెడ్డి (Justice Sudarshan Reddy) బరిలో ఉన్నారు.