హైదరాబాద్‌కు రాష్ట్రపతి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 28 తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఉదయం నల్సార్ లా యూనివర్సిటీ స్నాతకోత్సవానికి హాజరై మధ్యాహ్నం రాష్ట్రపతి నిలయంలో భారతీయ కళా మహోత్సవ్‌ను ప్రారంభిస్తారని రాష్ట్రపతి నిలయం పేర్కొంది. ఏర్పాట్లపై ఆయా శాఖల అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు.