Prashanth Reddy :ఈ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం … ఆనవాయితీని తుంగలో తొక్కింది

కేసీఆర్ మీద అక్కసుతో ఆయనకు సరైన ఛాంబర్ కూడా కేటాయించలేదని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి (Prashanth Reddy ) అన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నాయకుడు సూచించిన వారినే పీఏసీ చైర్మన్ (PAC Chairman )గా నియమించడం ఆనవాయితీ. ఈ విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం అనవాయితీని తుంగలో తొక్కింది. ప్రతిపక్ష నేతను సంప్రదించకుండానే పీఏసీ చైర్మన్‌ను నియమించారు.
కేసీఆర్ (KCR) 14 ఏళ్లు పోరాటం చేసి తెలంగాణ సాధించారు. పదేళ్లు సీఎంగా పనిచేసిన తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపారు. సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) జుగుప్పాకరంగా మాట్లాడి తెలంగాణ పరువు తీశారు. బీజేపీ (BJP) జపం చేస్తూ పొగుడుతూ, కేసీఆర్‌ను మాత్రం అగౌరవపరిచారు. ప్రజాస్వామ్యంలో సీఎంకు ఎంత ప్రాధాన్యత ఉంటుందో, ప్రతిపక్ష నేతకు అంతే ప్రాధాన్యత ఉంటుంది అని అన్నారు.