Ponnam Prabhakar: రిజర్వేషన్లు పెంచకుంటే వచ్చే ఎన్నికల్లో.. బీజేపీ ఓటమి
బీసీ రిజర్వేషన్ల కోసం తుదివరకు పోరాడతామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ఢల్లీిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గాంధేయ పద్ధతిలో పోరాడి అనుకున్నది సాధిస్తామన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి (Kishan Reddy లాంటి వారి కుట్రలను సాగనివ్వమన్నారు. లోక్సభ (Lok Sabha) ఎన్నికల్లో బీజేపీ (BJP) చావుతప్పి కన్నులొట్టపోయిన చందంగా గెలిచిందని ఎద్దేవా చేశారు. ఉత్తరాదిలో చాలా రాష్ట్రాల్లో బీసీలు ఆ పార్టీని తిరస్కరించారని చెప్పారు. రిజర్వేషన్లు పెంచకుంటే వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. శాసనసభలో బీసీ బిల్లుపై తీర్మానం సందర్భంలో కిషన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా అభిప్రాయం చెప్పి ఉంటే ఆరోజే చర్చ జరిగేది. కానీ ఆ బిల్లు చట్టం రూపంలో మారి గవర్నర్ ఆమోదంతో ఢల్లీికి వచ్చిన తర్వాత మీరు ముస్లింల పేరుతో ఈ కార్యక్రమాన్ని అడ్డుకోవడం సరికాదు. మిమ్మల్ని బహిరంగ చర్చకు కూడా ఆహ్వానించదల్చుకున్నా. మా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది. కామారెడ్డి డిక్లరేషన్ నుంచి జంతర్ మంతర్ ధర్నా (Jantar Mantar dharna) వరకు మేం బాధ్యతగా ఉన్నాం అని అన్నారు.







