Ponnam Prabhakar :వారికి మాట్లాడే నైతిక హక్కు లేదు : మంత్రి పొన్నం

కులగణన జరగకుండా చేయాలని బీఆర్‌ఎస్ కుట్ర చేసిందని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) ఆరోపించారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ బీఆర్‌ఎస్ (BRS)లో మూడు కీలక పదవులు ఒకరికే ఉండటంపై ఎందుకు మాట్లాడరని నిలదీశారు. కులగణనలో పాల్గొనని వారికి మాట్లాడే నైతిక హక్కు లేదన్నారు. కులగణన సర్వే ద్వారా బలహీన వర్గాలకు ఒక రోడ్ మ్యాప్ (Road map) తయారైందని పేర్కొన్నారు. కులగణనలో ఏం పొరపాటు జరిగిందో చెప్పాలని, బాధ్యతగా తీసుకొని సరిచేస్తామన్నారు. డిక్లరేషన్ (Declaration) ప్రకారమే అన్ని హామీలు అమలు చేస్తామని పొన్నం వెల్లడిరచారు.