Minister Ponguleti : వచ్చే ఎన్నికల్లో బీజేపీకి తగ్గిన బుద్ధి చెప్పాలి : మంత్రి పొంగులేటి

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేశామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. హనుమకొండ బాలసముద్రంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల (Double bedroom houses ) ను పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఏ పార్టీ కార్యకర్త అని కూడా చూడకుండా ఎంపిక చేసినట్లు తెలిపారు. పార్టీలకు అతీతంగా పేదవాడైతే చాలు, ఇళ్లు ఇవ్వాలని అధికారులకు చెప్పాం. పేదల ముఖంలో నవ్వు చూడటమే కాంగ్రెస్ ప్రభుత్వం లక్ష్యం. గత ప్రభుత్వం రెండు పడక గదుల ఇళ్లను కొందరికి మాత్రమే ఇచ్చింది. పదేళ్ల పాటు ఎవరికీ రేషన్ కార్డులు(Ration cards) ఇవ్వలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి విడతలో 4.50 లక్షల మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశాం. 6.50 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చాం. రైతుభరోసా కింద రైతుల ఖాతాల్లో 9 రోజుల్లోనే రూ.9 వేల కోట్లు జమ చేశాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం (BRS government) వేల కోట్ల కమీషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు (Kaleshwaram Project) ను నిర్మించింది. రూ.లక్ష కోట్లతో నిర్మించిన ప్రాజెక్టు మూడేళ్లకే కూలింది. నిర్మాణంలో జరిగిన అక్రమాలను విచారణ కమిషన్ బయటపెట్టింది. బీసీలకు రిజర్వేషన్లను పెంచుతూ కాంగ్రెస్ ప్రభుత్వం చట్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించిన బిల్లులను కేంద్రంలోని బీజేపీ ఆమోదించలేదు. బీసీ రిజర్వేషన్లకు అడ్డుపడుతున్న బీజేపీకి వచ్చే ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలి అని తెలిపారు.