KCR : కేసీఆర్ పై హైకోర్టులో పిటిషన్!

బీఆర్‌ఎస్ అధినేత, ఎమ్మెల్యే కేసీఆర్ (KCR) అసెంబ్లీకి రావట్లేదంటూ హైకోర్టు (High Court)లో పిటిషన్ దాఖలైంది. విజయ్‌పాల్‌రెడ్డి (Vijaypal Reddy) వేసిన ఈ ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టులో విచారణ జరిగింది. ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్, అసెంబ్లీ వేదికగా ప్రజా సమస్యలను లేవనెత్తాల్సిన బాధ్యత ఆయనపై ఉందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. కొన్ని నెలలుగా ఆయన అసెంబ్లీ (Assembly) సమావేశాల్లో పాల్గొనడం లేదని, ఇలా సమావేశాలకు హాజరు కాకుంటే చట్టప్రకారం అనర్హుడిగా ప్రకటించవచ్చన్నారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శికి ఆదేశాలు జారీ చేయాలని ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు. కాగా ఈ వ్యాజ్యంలో జోక్యం చేసుకోవడానికి కోర్టు పరిధి ఏంటని ధర్మాసనం ప్రశ్నించింది. ఈ పిల్‌కు అర్హత లేదని శాసనసభ వ్యవహారాల తరపు న్యాయవాది (Lawyer) కోర్టుకు తెలిపారు. అయితే, కోర్టులు జోక్యం చేసుకోవచ్చని, ఈ మేరకు వాదనలు వినిపించడానికి గడువు కావాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరడంతో విచారణను కోర్టు 2 వారాలకు వాయిదా వేసింది.