Kesava Rao : కేకే కుటుంబ సభ్యులకు స్థలం క్రమబద్ధీకరణపై… హైకోర్టులో

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు (K. Kesava Rao) కుటుంబ సభ్యులకు స్థలం క్రమబద్ధీకరణపై హైకోర్టు (High Court) లో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. తక్కువ ధరకు బంజారాహిల్స్‌లోని ఎన్‌బీటీ నగర్‌లో ఉన్న భూమిని జీవో నెం. 56 ద్వారా కేటాయించారని రఘువీర్‌రెడ్డి (Raghuveer Reddy) పిటిషన్ దాఖలు చేశారు. రెవెన్యూ అధికారులతో పాటు గద్వాల విజయలక్ష్మి (Vijayalakshmi), జీపీఏ హోల్డర్ కవిత (Kavitha)ను ప్రతివాదులుగా చేర్చారు. స్థలం కేటాయిస్తూ జారీ చేసిన జీవోను రద్దు చేయాలని కోరారు. ఈ పిటిషన్‌పై సీజే ధర్మాసనం విచారణ చేపట్టింది. కౌంటర్ దాఖలు చేయడానికి ప్రతివాదుల తరపు న్యాయవాదులు సమయం కోరడంతో తదుపరి విచారణను హైకోర్టు వచ్చే నెల 27కి వాయిదా వేసింది.