Palle Gangareddy : పసుపుబోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి బాధ్యతల స్వీకారం

జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా పల్లె గంగారెడ్డి (Palle Gangareddy )ఢల్లీిలో బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర వాణిజ్యశాఖ కార్యాలయంలో ఈ బోర్డుకు కొత్త కేటాయించిన కార్యాలయంలో ఆయన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ (Dharmapuri Arvind) సమక్షంలో బాధ్యతలు చేపట్టారు. కేంద్ర వాణిజ్యశాఖ పరిధిలోకి వచ్చే వివిధ బోర్డులకు ఇక్కడి ఉద్యోగ్‌భవన్ (Udyog Bhavan)లో కార్యాలయాలు ఉన్నాయని, అందుకే తాను ఇక్కడ బాధ్యతలు స్వీకరించినట్లు తెలిపారు. కొత్తగా ఏర్పాటైన ఈ బోర్డు (Board) విధివిధానాలను ఖరారు చేసి త్వరలో కార్యాచరణ మొదలు పెడతామని వెల్లడిరచారు. పసుపు రైతులకు నాణ్యమైన విత్తనం అందుబాటులో ఉంచడం, కొత్త రకాలను అందుబాటులోకి తేవడం, విలువ జోడిరచి రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడటం, మార్కెట్‌ను , ఎగుమతులను విస్తరించడమే తాను ప్రధాన లక్ష్యంగా నిర్దేశించుకున్నట్లు తెలిపారు. పసుపు రైతుగా తనకు ఈ పంట సాగులోని సాధకబాధకాల గురించి పూర్తి అవగాహన ఉందని తెలిపారు.