Palamuru: తెలంగాణ ప్రతిపాదనను తిరస్కరించిన కేంద్రం

పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా (National status) కల్పించాలంటూ తెలంగాణ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది. కృష్ణానదీ జలాలపై తెలంగాణ (Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh ) మధ్య వివాదం కోర్టులో ఉన్న నేపథ్యంలో జాతీయ హోదా సాధ్యం కాదని జల్‌శక్తి శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను తిరిగి పంపినట్లు లోక్‌సభకు కేంద్రం వెల్లడిరచింది. 2024 డిసెంబర్‌లోనే ఈ ప్రక్రియ చేపట్టినట్లు తెలిపింది. ఈ మేరకు ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) అడిగిన ప్రశ్నకు జల్‌శక్తికి లిఖితపూర్వక సమాధానం ఇచ్చింది.