Payal Shankar :బీఆర్‌ఎస్‌కు పట్టిన గతే ..త్వరలోనూ కాంగ్రెస్‌కు : పాయల్ శంకర్

కేంద్ర బడ్జెట్ చూసి దేశ ప్రజలంతా సంతోషపడుతున్నారని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ (Payal Shankar) అన్నారు. బీజేపీ (BJP) రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గడచిన 75 ఏళ్లల్లో ఎప్పుడూ ఇలాంటి బడ్జెట్ (Budget) రాలేదని ప్రజలు భావిస్తున్నారని అన్నారు. విమర్శలు చేసే ముందు కాంగ్రెస్ (Congress) చెప్పిన ఆరు గ్యారంటీల గురించి మాట్లాడాలన్నారు. కులగణన సర్వేలో బీసీల జనాభాను తగ్గించి చూపించారు. ప్రజల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగింది. ప్రజా వ్యతిరేకత నుంచి దృష్టి మరల్చేందుకు కాంగ్రెస్ యత్నిస్తోంది. బీఆర్‌ఎస్ (BRS)కు పట్టిన గతే త్వరలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికీ పడుతుంది అని విమర్శించారు.