హైదరాబాద్ లో ఒప్పో ఇన్నోవేషన్ ల్యాబ్
చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ ఒప్పో. హైదరాబాద్ కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్‌ను ఆరంభించింది. ఇప్పటికే భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన పరిశోధన కేంద్రంలోనే ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. స్మార్ట్ ఫోన్ వీడియోగ్రాఫీలో వస్తున్న విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ ల్యాబ్‌లో కృత్రిమ మేధను వినియోగించి కెమెరా సొల్యూషన్లను అభివృద్ధి చేస్తారు. ఇమేజింగ్ సాఫ్ట్ వేర్ పై ల్యాబ్ దృష్టి పెడుతుంది. ఈ ఏడాది జూన్ నాటికి 8,800 ఇమేజ్ పేటెంట్లకు ప్రపంచవ్యాప్తంగా ఒప్పో దరఖాస్తు చేసింది. ఇందులో 3,500 పేటెంట్లు లభించాయి. ఇమేజ్ టెక్నాలజీలో మరింత బలోపేతం కావడానికి హైదరాబాద్‌లోని కెమెరా ఇన్నోవేషన్ ల్యాబ్ దోహం చేయగలదని ఇండియా ఆర్ అండ్ అధిపతి తస్లీమ్ ఆరీఫ్ తెలిపారు.






