Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డితో ముగిసిన మందకృష్ణ మాదిగ భేటీ

ఎస్సీ ఉపకులాల వర్గీకరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) గారి కమిట్ మెంట్ ను అభినందించిన మందకృష్ణ మాదిగ (Manda Krishna Madiga). ఒక కమిట్ మెంట్ తో వర్గీకరణ ప్రక్రియను చేపట్టిన ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారికి ఒక సోదరుడిగా అండగా ఉంటానన్న మందకృష్ణ మాదిగ. ఉపకులాల వర్గీకరణలో పలు సమస్యలను సీఎంకు వివరించిన మందకృష్ణ మాదిగ.
రాజకీయ ప్రయాజనాలకు అతీతంగా, మాదిగ, మాదిగ ఉపకులాలకు మేలు చేయాలనే మంచి లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ఉందని స్పష్టం చేసిన సీఎం రేవంత్ రెడ్డి. అసెంబ్లీలో చర్చించి, కేబినెట్ సబ్ కమిటీ వేసి, న్యాయ కమిషన్ వేసి, నివేదికలను వేగంగా తీసుకుని, కేబినెట్ లో చర్చించి, అసెంబ్లీలోనే నిర్ణయం తీసుకున్నామని వివరించిన సీఎం. దీనివల్ల ఎలాంటి న్యాయ పరమైన చిక్కులు లేకుండా చేశామని వివరించిన సీఎం రేవంత్ రెడ్డి. వర్గీకరణకు తీర్మానం చేయాలని ప్రతిపక్ష ఎమ్మెల్యేగా అసెంబ్లీలో కొట్లాడిన విషయాన్ని గుర్తు చేసిన ప్రతినిధులు. సమస్యలు, అభ్యంతరాలను కేబినెట్ సబ్ కమిటీతో పాటు కమిషన్ దృష్టికి తీసుకెళ్లాలని సూచించిన సీఎం.