Bhatti Vikramarka : రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలి

రాష్ట్ర ప్రయోజనాల కోసం అందరం ఏకం కావాలని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) పిలుపునిచ్చారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు రాబట్టడం కోసం ఎంపీలతో ప్రజాభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ పార్లమెంట్ (Parliament)లో ఏయే అంశాలు లేవనెత్తాలనే విషయాలపై చర్చించి విపులంగా బుక్‌లెట్ తయారు చేసినట్టు తెలిపారు. రాష్ట్రానికి రావాల్సిన నిధుల విషయంలో పదేళ్లు బీఆర్‌ఎస్ నిర్లక్ష్యంగా వ్యహరించిందని, ఏడాదిగా తాము తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిపారు. అయినప్పటికీ మెట్రో విస్తరణ(Metro expansion), మూసీ ప్రక్షాళన సహా అనేక ప్రాజెక్టులకు కేంద్రం సహకారం అందట్లేదన్నారు. రాష్ట్రానికి లబ్ది చేకూరేలా అవసరమైతే పార్లమెంట్ సమావేశాల్లో అడ్జెయిన్ మెంట్ మోషన్ ఇచ్చే అవకాశాలను ఎంపీలకు వివరించామని తెలిపారు. సమావేశానికి రాని ఎంపీలకు బుక్‌లెట్ (Booklet) అందిస్తామని, అవసరమైతే మరోసారి భేటీ నిర్వహించేందుకుకైనా సిద్ధమేనని స్పష్టం చేశారు.