Lakshman :ఏప్రిల్ లోపు బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక

ఏప్రిల్ లోపు బీజేపీ జాతీయ అద్యక్షుడి ఎన్నిక పూర్తవుతుందని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ (Lakshman) అన్నారు. ఢల్లీిలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్‌ఎస్ (BRS) అనేది గత చరిత్ర అని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదిగిందన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ముగ్గురు అభ్యర్థులను పోటీలో పెట్టిన ఏకైక పార్టీ తమదని చెప్పారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌కు అభ్యర్థులను నిలబెట్టలేని పరిస్థితి ఏర్పడిరదని ఎద్దేవా చేశారు. గ్యారంటీల పేరుతో కాంగ్రెస్ (Congress) మోసగించిందని విమర్శించారు. ప్రజలను ఆర్థికంగా శక్తిమంతం చేయడమే ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) లక్ష్యమన్నారు.