Parliament: దక్షిణాదిలో ఒక్క పార్లమెంటు సీటు కూడా తగ్గదు : ఎంపీ లక్ష్మణ్

దక్షిణాదిలో ఒక్క పార్లమెంట్ సీటు (Parliament seat) కూడా తగ్గదని ప్రధాని మోదీ చెప్పారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్ (K. Lakshman ) తెలిపారు. హైదరాబాద్‌లో లక్ష్మణ్ మీడియాతో మాట్లాడారు. జన గణన చేసిన తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్(Women’s reservation) ఖరారు చేస్తారని వెల్లడిరచారు. 2011తో పోలిస్తే రెండు తెలుగు రాష్ట్రాల్లో జనాభా తగ్గింది. జనాభా తగ్గినప్పటికీ రెండు తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంట్ సీట్లు తగ్గవు. ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో 153 సీట్లు తెలంగాణ (Telangana)లో పెంచాలని పెట్టారు. దక్షిణాది వ్యక్తికి జాతీయ అధ్యక్ష పదవి అని ఎక్కడా చర్చలేదు. 11 రాష్ట్రాల అధ్యక్షులను ప్రకటించాం. త్వరలోనే అన్ని రాష్ట్రాలకు ప్రకటిస్తాం. డీపీఆర్ సర్వే సక్రమంగా చేయకపోతే ట్రిపుల్ ఆర్ (Triple R) వెనుకకు వెళ్త్తుంది. బీఆర్‌ఎస్ చేసిన తప్పునే కాంగ్రెస్ చేస్తే ఎట్లా? బీసీల్లో 10 శాతం ముస్లింలను కలపకపోతే ఆమోదిస్తాం. కులగణన తప్పుల తడకగా ఉంది. సీఎం రేవంత్ రెడ్డికి అవగాహన లేదు. బీజేపీ బలం పెరుగుతుందని రేవంత్‌రెడ్డికి భయం పట్టుకుంది. ఆయనే మిగతా నాలుగేళ్లు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరుకుంటున్నారు. సీఎం మార్పు అనేది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అంశం. జమిలి ఎన్నికలపై చర్చ జరుగుతోంది. ఇప్పటికే రెండు మూడు సమావేశాలు జరిగాయి. కుల గణన చేపట్టిన రేవంత్ రెడ్డి ఏ ఒక్కరిని సంతృప్తి పరచలేదు అని అన్నారు.