హైదరాబాద్ లో క్రెడాయ్ ప్రాపర్టీ షో

క్రెడాయ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో మూడురోజుల పాటు ప్రాపర్టీ షో జరుగుతుంది. ఈ నెల 15వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఈ ప్రాపర్టీ షో ఉంటుందని వారు పేర్కొన్నారు. హైటెక్స్, మాదాపూర్‌లో ప్రాపర్టీ షో ఉంటుందని, ఈ షో చూడడానికి వచ్చే వారికి ఉచిత ప్రవేశమని వారు తెలిపారు. 150 మంది డెవలపర్లు, 15వేల ప్రాపర్టీ షోలు పాల్గొంటున్నాయని అన్నారు. మొదటిరోజు (15వ తేదీ) సాయంత్రం తెలంగాణ అథారిటీ చైర్మన్ రాజేశ్వర్ తివారీ (తెలంగాణ రెరా చట్టం అమలు తీరుపై) మాట్లాడుతారని వారు తెలిపారు. మై హోం, అపర్ణా, వాసవి, సైబర్‌సిటీ లాంటి ప్రముఖ సంస్థలతో పాటు ముఖ్యమైన డెవలపర్లు ఈ ప్రాపర్టీ షోలో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. ఈ షోకు పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారని నిర్వాహకులు ఆశిస్తున్నారు.