MLC Kavitha: ఈ అంశంలో ప్రధానిపై ఒత్తిడి తేలేదు : ఎమ్మెల్సీ కవిత

బీసీ రిజర్వేషన్లు అమలు కాకుండా కాంగ్రెస్ (Congress) , బీజేపీ కుట్ర చేస్తున్నాయని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును శాసనసభ, మండలిలో ఆమోదించి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపిందన్నారు. కానీ రిజర్వేషన్లకు మతం రంగుపులిమి రాష్ట్రపతి వద్దకు కేంద్రం ప్రభుత్వం పంపలేదని ఆరోపించారు. రాష్ట్రంలో బీజేపీకి ఓట్లు రావని తెలిసే ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachandra Rao) బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చలేమని మాట్లాడారు. ఉత్తరాది రాష్ట్రాల్లో 50 శాతం పైగా రిజర్వేషన్లు అమలు చేస్తూ దక్షిణాదిలో న్యాయపరమైన సమస్యలు అంటూ దాటవేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇప్పటి వరకు 50 సార్లు ఢల్లీి వెళ్లినా, ఈ అంశంలో ప్రధానిపై ఒత్తిడి తేలేదు. అఖిలపక్షాన్ని ఢల్లీికి తీసుకెళ్తే 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లును 9వ షెడ్యూల్‌లో చేర్చాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) లో కేవియట్ పిటిషన్ వేసి రిజర్వేషన్లపై ఆర్డినెన్స్ తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించాలి అని డిమాండ్ చేశారు.