Rajagopal Reddy : అయితే ఆ హామీని అదిష్ఠానం అమలు చేయలేదు : రాజగోపాల్రెడ్డి
తనకు మంత్రి పదవి ఇస్తామని గతంలో భట్టి విక్రమార్క హామీ ఇచ్చారని, ఇది వాస్తవమని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి (Rajagopal Reddy) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అయితే ఆ హామీని అధిష్ఠానం అమలు చేయలేదని వాపోయారు. ఈ విషయంలో తనను రాష్ట్రంలోని ముఖ్య నేతలే అడ్డుకుంటూ అవమానిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ఇందులో వాస్తవాన్ని ప్రజలకు వివరించిన భట్టి విక్రమార్క (Bhatti Vikramarka )కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. తనకు మంత్రి (Minister) పదవి ముఖ్యం కాదని, ప్రభుత్వం అవినీతిరహిత పాలనను అందించాలని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతున్నానన్నారు. తెలంగాణ(Telangana) సమాజం ఆకాంక్షలు నెవేర్చేలా కాంగ్రెస్ (Congress) ప్రభుత్వ పాలన ఉండాలని ఆకాంక్షించారు.







