Miss World : యాదగిరీశుడి సేవలో మిస్ వరల్డ్ క్రిస్టినా

యాదగిరిగుట్ట (Yadagirigutta) పుణ్యక్షేత్రాన్ని మిస్ వరల్డ్ క్రిస్టినా పిస్కోవా (Christina Piskova) సందర్శించారు. ప్రధానాలయంలో స్వయంభువులైన పంచనారసింహులను దర్శించుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ హనుమంతరావు (Hanumantha Rao), ఆలయ ఈవో భాస్కర్‌రావు (Bhaskar Rao)లు ఆమెకు స్వాగతం పలికారు. స్వామి దర్శనం అనంతరం క్షేత్ర విశిష్టత, ఆలయ సంప్రదాయాలను అడిగి తెలుసుకున్నారు. అఖండ దీపారాధాన చేసి, టెంకాయ సమర్పించారు. 2024లో మిస్ వరల్డ్ హోదా పొందిన క్రిస్టినా భారత (Indian ) పర్యటనలో భాగంగా యాదగిరిగుట్ట క్షేత్రాన్ని సందర్శించి విశేషాలను తెలుసుకున్నారు. క్షేత్ర సందర్శనతో మానసిక ప్రశాంతత కలిగిందన్నారు.