Miss World: హైదరాబాద్‌లో మిస్ వరల్డ్ పోటీలు

ప్రపంచ సుందరి ( మిస్ వరల్డ్) (Miss World ) పోటీలకు హైదరాబాద్ వేదిక సిద్ధమవుతోంది. మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ నిర్వహించే ఈ పోటీలకు రాష్ట్ర పర్యాటక శాఖ అన్ని రకాలుగా సహాయ సహకారాలను అందిస్తోంది. పోటీదారులు, న్యాయ నిర్ణేతలు, మీడియా తదితర ప్రతినిధులకు సకల ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు కార్యక్రమానికి సంబంధించి అధికారిక షెడ్యూల్‌ను వెల్లడిరచారు. మే 7 నుంచి 31 వరకు 28 రోజుల పాటు ప్రపంచ సుందరి పోటీల కార్యక్రమం ఉంటుందని మిస్ వరల్డ్ ఆర్గనైజేషన్ (Miss World Organization) తెలిపింది. మే 31న మిస్ వరల్డ్ ఫినాలే ఉంటుంది. ఇందులో విజేతలైనవారు రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజైన జూన్ 2న రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేశ్ వర్మ (Jishnu Desh Verma), సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) లతో మర్యాదప్వూకంగా భేటీ అవుతారు. ఆ రోజుతో పోటీలు ముగుస్తాయి. మే 6, 7 తేదీల్లో 170 దేశాల నుంచి పోటీదారులు, ప్రతినిధుల రాక ఉంటుంది. మే 10న గచ్చిబౌలి స్టేడియంలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. పోటీదారులు నాలుగు బృందాలుగా విడిపోయి మే 12 నుంచి రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పర్యటిస్తారు.