క్లైమేట్ సెన్స్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల భేటీ

వ్యవసాయ రంగంలో రైతులకు లబ్ధి చేకూర్చే విస్తృత పరిశోధనలను ప్రోత్సహిస్తామని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. అమెరికాకు చెందిన క్లైమేట్ సైన్స్ కంపెనీ ప్రతినిధులు జార్జి రేమండ్, ఫిలిప్ జాక్‌లు మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా పునరుత్పాదక వ్యవసాయం, సేంద్రీయ ఎరువుల వాడకం, వరిలో కర్బన ఉద్గారాలను తగ్గించే పరిశోధనల గురించి పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. సెన్సార్ల వినియోగంతో వరిసాగు, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను వారు వివరించారు.