Gade Satyam: ఆయన సలహాలతోనే రాజకీయంగా ఎదిగా : మంత్రి తుమ్మల

ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో తన ముఖ్య అనుచరుడు, రాజకీయ నిర్దేశకుడు గాదె సత్యం సంతాప సభలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) కన్నీటి పర్వంతమయ్యారు. గాదె సత్యం(Gade Satyam) సంతాప సభలో మంత్రి తుమ్మల మాట్లాడారు. నియోజకవర్గ(Constituency), జిల్లా (district) రాజకీయాల్లో పెను మార్పులు రావడానికి తనకు సహకారం అందించిన ముఖ్యుల్లో సత్యం ఒకరని తెలిపారు. సత్యం మృతి బాధాకరమని కన్నీరు పెట్టారు. ఆయన సలహాలు(Suggestions), ఆలోచనలకు అనుగుణంగానే తన రాజకీయ నడవడిక జరిగిందన్నారు. ఆయన లేకపోవడంతో తన భవిష్యత్తు రాజకీయాలకు, వ్యక్తిగతంగా తీరని లోటు అని అన్నారు.