Minister Sridharbabu :వారి హత్యకేసు సీబీఐకి.. స్వాగతించిన మంత్రి శ్రీధర్‌బాబు

న్యాయవాదులు గట్టు వామనరావు (Gattu Vamana Rao) దంపతుల హత్యకేసును సీబీఐ (CBI)కి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridharbabu) అన్నారు. హైదరాబాద్ అబిడ్స్‌లోని ఓ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో వామనరావు దంపతులను దారుణంగా హత్య చేస్తే విచారణ కూడా సరిగ్గా చేపట్టలేదని విమర్శించారు. దీంతో వామనరావు తండ్రి వెంకటరావు (Venkata Rao) సుప్రీంకోర్టు (Supreme Court) ను ఆశ్రయించారని తెలిపారు. సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వారి హత్యలో గత ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల హస్తం ఉందని ఆరోపించారు . న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉందని, దోషులు ఎంతటివారైనా చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. న్యాయవాదుల రక్షణ కోసం, చట్టం తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.