Sridharbabu: తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి : మంత్రి శ్రీధర్‌బాబు
తెలంగాణలో పెట్టుబడులకు ముందుకు రావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridharbabu) పిలుపునిచ్చారు. అసెంబ్లీ కమిటీ హాల్లో యూఎస్ ఇండియానా రాష్ట్ర కార్యదర్శి డియెగో మోరాలెస్ (Diego Morales) నేతృత్వంలో ప్రతినిధుల బృందం ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిసింది. తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలు, పెట్టుబడులకు ముందుకొచ్చే పారిశ్రామికవేత్తలకు అందిస్తున్న ప్రోత్సాహకాలను మంత్రి వివరించారు. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేతృత్వంలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను ట్రిలియన్ డాలర్లకు చేర్చేందుకు ప్రభుత్వం ప్రణాళికా బద్ధంగా కృషి చేస్తుంది. యూఎస్ ఇండియానా రాష్ట్రంతో కలిసి పని చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీరు తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకున్న అనుకూలతలను మీ వద్ద ఉన్న పారిశ్రామికవేత్తలకు వివరించండి అని ఆ రాష్ట్ర ప్రతినిధులకు మంత్రి కోరారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి తమ రాష్ట్రంలో పర్యటించాలని శ్రీధర్‌బాబును డియోగ్ మోరాలెస్ ఆహ్వానించారు. డియెగో మోరాలెస్ సతీమని సిడోనియా నికోల్, సోజోస్ క్యాపిటల్ సీఈవో ఫాబియా పెరేజ్ పెర్రెయా, ఇండియానా-ఇండియా బిజినెస్ కౌన్సిల్ అధ్యక్షుడు రాజు, టీజీఐఐసీ ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి (Vishnuvardhan Reddy) సీఈవో మధుసూదన్ పాల్గొన్నారు.







