US Consulate : హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ వెళ్లే వారికి గుడ్ న్యూస్

హైదరాబాద్‌లోని యూఎస్ కాన్సులర్ (US Consulate) జనరల్ కార్యాలయంలో సందర్శకుల కోసం కొత్తగా రూ.1.5 కోట్లతో టీఎస్‌ఐఐసీ (TSIIC) ఏర్పాటు చేసిన నిరీక్షణ ప్రాంగణాన్ని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (Sridharbabu) , అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నీఫర్ లార్సన్ (Jennifer Larson) ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడుతూ యూఎస్ కాన్సులేట్‌కు ప్రతి రోజు 3 వేల మందికి పైగా సందర్శకులు వస్తుంటారని, వేచి ఉండేందుకు సరైన సౌకర్యాలు లేక వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికొచ్చిందని తెలిపారు. సందర్శకుల అవసరాలకనుగుణంగా ఆధునిక వసతులతో నిరీక్షణ ప్రాంగణాన్ని ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వం వేసే ప్రతి అడుగు తెలంగాణ (Telangana) ప్రజల కోసమేనని శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు.