Minister Seethakka:కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం సంకల్పం : మంత్రి సీతక్క
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు 250 ఇందిరమ్మ క్యాంటీన్లు (Indiramma canteens) ఏర్పాటు చేశామని రాష్ట్ర మంత్రి సీతక్క (Minister Seethakka) తెలిపారు. శాసనసభ (Legislative Assembly)లో ఆమె మాట్లాడారు. క్యాంటీన్ల నిర్వహణ, పెట్టుబడి కోసం స్వయం సహాయక సంఘాల సభ్యులకు వడ్డీలేని రుణాలు ఇస్తున్నట్లు చెప్పారు. స్వయం సహాయక సంఘాల సభ్యులకు 10 రోజులపాటు హైదరాబాద్లో (Hyderabad) శిక్షణ ఇచ్చామన్నారు. పట్టణ ప్రాంతాల్లో 130 క్యాంటీన్లు చేసినట్లు వివరించారు. కోటిమంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేది సీఎం రేవంత్రెడ్డి (Revanth Reddy) సంకల్పమని తెలిపారు.






