Seethakka: మహిళా దినోత్సవం నాడు లక్ష మంది మహిళలతో సభ: సీతక్క

మహిళా దినోత్సవం (Women’s Day) (మార్చి 8) సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్‌లో సుమారు లక్ష మంది మహిళలతో పెద్ద సభ నిర్వహించనున్నట్లు తెలంగాణ మంత్రి సీతక్క (Minister Seethakka) ప్రకటించారు. మహిళా దినోత్సవాన్ని ప్రత్యేకంగా జరుపుకోవడంతో పాటు, పలు కొత్త సంక్షేమ పథకాలను కూడా ఈ సందర్భంగా ప్రాంరభిస్తామని ఆమె తెలిపారు. ఈ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ‘ఇందిరా మహిళా శక్తి పాలసీ’ ని ఆవిష్కరిస్తారని సీతక్క చెప్పారు. ‘‘నారాయణపేట జిల్లాలో ప్రస్తుతం పూర్తిగా మహిళలే నిర్వహిస్తున్న పెట్రోలు బంకుల ఉన్నాయి. మిగతా 31 జిల్లాల్లో కూడా పెట్రోలు బంకులను మహిళలే నిర్వహించేలా ఆయిల్ కంపెనీలతో ఆరోజున ప్రభుత్వం ఒప్పందం చేసుకుంటుంది’’ అని ఆమె (Minister Seethakka) తెలిపారు.
అలాగే మహిళా సంఘాలను ప్రోత్సహించడం కోసం 32 జిల్లాల్లో 64 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ముఖ్యమంత్రి వర్చువల్‌గా ప్రారంభించనున్నారని సీతక్క (Minister Seethakka) ప్రకటించారు. అలాగే, వడ్డీ లేని రుణాలు అందించడానికి చెక్కులు పంపిణీ చేస్తారని, ప్రమాదవశాత్తు మరణించిన మహిళల కుటుంబాలకు రూ.40 కోట్ల విలువైన బీమా చెక్కులను కూడా అందిస్తారని ఆమె పేర్కొన్నారు. అలాగే, పట్టణాల్లో మహిళా సంఘాల బలోపేతం కోసం కూడా సీఎం (CM Revanth Reddy) కీలక ప్రకటనలు చేస్తారని తెలిపారు.