Seethakka : రాజకీయంగా ఎదుర్కోవాలి … కానీ, సామాజిక మధ్యమాల్లో : మంత్రి సీతక్క

బీఆర్‌ఎస్ సోషల్ మీడియా ద్వారా లబ్ధి పొందాలని చూస్తోందని రాష్ట్ర మంత్రి సీతక్క (Seethakka) ఆరోపించారు. సోషల్ మీడియా (Social media )ద్వారా నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నాపై పెట్టిన పోస్టులకు మానసికంగా ధైర్యం కోల్పోయా. నిజాయతీగా పనిచేసే మహిళల ధైర్యాన్ని సోషల్ మీడియా దెబ్బతీస్తుంది. ఒక మంచి పని చేసి సోషల్ మీడియాలో పోస్టు చేస్తే దాన్ని స్ఫూర్తిగా తీసుకొని మరో పది మంది సాయం చేసేలా ఉండాలి. మార్చురీ అన్న పదం ఒక వ్యక్తిని ఉద్దేశించి అన్నది కాదు ఒక పార్టీని అన్నారు.
రాజకీయంగా ఎదుర్కోవాలి. కానీ, సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం చేయడమేంటి? బాడీ షేమింగ్ చేయకూడదు. సోషల్ మీడియాకి హద్దు ఉండాలి. అబద్ధాలకి బ్రాండ్ అంబాసిడర్‌గా బీఆర్‌ఎస్ (BRS) మారింది. ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే నిజం అవుతుందని ఆ పార్టీ నమ్ముతోంది. సోషల్ మీడియాలో బీజేపీ(BJP), బీఆర్‌ఎస్ అన్నదమ్ములు. సోషల్ మీడియాలో పెట్టే పోస్టుల విషయంలో కట్టడికి ఒక చట్టం తీసుకు రావాలి అని అన్నారు.