Ponnam Prabhakar : ఎంపీలు రాజీనామా చేస్తే .. ఎందుకు అమలుకావో : మంత్రి పొన్నం

బీసీలకు 42శాతం రిజర్వేషన్ల పెంపు సాధ్యమేనని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) అన్నారు.ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు (Ramachandra Rao) పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రామచందర్‌రావు మరోసారి తన నిజస్వరూపం బయట పెట్టుకున్నారు. బీసీల రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చడం అసాధ్యం అంటున్నారు. పొరుగు రాష్ట్రం తమిళనాడు (Tamil Nadu) లో రిజర్వేషన్లు పెంచారు. రాష్ట్రం నుంచి ఎన్నికైన బీజేపీ ఎంపీలు (BJP MPs )రాజీనామా చేయాలి. ఎంపీలు రాజీనామా చేస్తే బీసీ రిజర్వేషన్లు ఎందుకు అమలుకావో చూస్తాం. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం వెంటనే నిర్ణయం తీసుకోవాలి. బీసీ వర్గాలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోం అని పేర్కొన్నారు.