Ponnam Prabhakar : కులగణనపై సలహాలు, సూచనలు… స్వీకరించేందుకు సిద్ధం

కులగణనపై విమర్శలను బీసీలపై దాడిగానే చూస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. గాంధీభవన్ (Gandhi Bhavan) లో నిర్వహించిన మీడియా సమావేశంలో పొన్నం మాట్లాడుతూ దీనిపై విమర్శలు చేసేవారు పునరాలోచించుకోవాలని హితవు పలికారు. బీసీల మేలు కోసం చేసే ప్రయత్నాలు అడ్డుకోవద్దు. నిర్ణీత గడువులోపు కులగణన చేసిన యంత్రాంగాన్ని అభినందిస్తున్నాం. ఈ విషయంలో స్ఫూర్తినిచ్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ (Rahul Gandhi)కి ధన్యవాదాలు చెబుతున్నాం. కులగణన వివరాలను పబ్లిక్ డొమైన్‌లో పెడతాం. దీనిపై సలహాలు, సూచనలు స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం. కులగణనకు మాజీ సీఎం కేసీఆర్ (KCR)కుటుంబం నుంచి ఎమ్మెల్సీ కవిత (MLC Kavita) ఒక్కరే సమాచారం ఇచ్చారు అని తెలిపారు.