మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్ష్ కు… అంతర్జాతీయ పురస్కారం

తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్స్ రావు (15)కు 2021 సంవత్సరానికి గాను అంతర్జాతీయ పురస్కారం దక్కింది. బ్రిటన్‍లోని తెస్సి ఒజో సీబీఈ ఆధ్వర్యంలోని సంస్థ దివంగత వేల్స్ రాజకుమారి డయానా పేరిట నెలకొల్పిన ఈ అవార్డును ప్రపంచవ్యాప్తంగా సామాజిక సేవలందించే 9-25 ఏళ్లలోపు వారికి ఇస్తోంది. దీన్ని దక్కించుకున్న హిమాన్ష్ దృశ్యమాధ్యమంలో స్వీకరించారు. హిమాన్ష్ శోమ అనే పేరుతో గజ్వేల్ నియోజకవర్గంలోని గంగాపూర్, యూసుఫ్‍ఖాన్‍పల్లి గ్రామాల స్వయం సమృద్ధికి పలు కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా హిమాన్ష్ కు మంత్రి కేటీఆర్ అభినందనలు తెలిపారు. అంతర్జాతీయ పురస్కారం దక్కించుకున్న హిమాన్స్ తండ్రిగా గర్విస్తున్నానన్నారు. తాత కేసీఆర్ మార్గదర్శనంలో సేవలందిస్తూ పురస్కారం పొందానని హిమాన్ష్ తెలిపారు. ప్రాజెక్టు సహరించిన రెండు గ్రామాల ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు.