Jupally : ఆ ఆరోపణలను ఆయన నిరూపిస్తారా? : మంత్రి జూపల్లి

మిస్ వరల్డ్ పోటీలకు చాలా దేశాలతో పోటీ పడి హైదరాబాద్ అవకాశం దక్కించుకుందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) చేసిన ఆరోపణలపై మంత్రి స్పందించారు. ఈ సందర్భంగా జూపల్లి మీడియాతో మాట్లాడుతూ ఈ పోటీలతో తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలు, హస్తకళల గొప్పతనం ప్రపంచానికి తెలిసిందని చెప్పారు. బీఆర్‌ఎస్ చేసిన ప్రతి ఆరోపణపై బహిరంగ చర్చకు నేను సిద్ధం. మిస్ వరల్డ్ (Miss World ) పోటీల ఖర్చుపై హరీశ్‌రావు తప్పుడు ఆరోపణలు చేశారు. రూ.31 కోట్ల ఖర్చుతో 21 కోట్లు స్పాన్సర్ల ద్వారానే వచ్చింది. మరో 12 కోట్ల ఆదాయంపై ఒప్పందాలు ఉన్నాయి. రూ.200 కోట్లు ఖర్చు చేసినట్లు హరీశ్‌రావు ఆరోపిస్తున్నారు. ఆ ఆరోపణలను ఆయన నిరూపిస్తారా? అని సవాల్ విసురుతున్నా. మిస్ వరల్డ్ కంటెస్టెంట్ల (Miss World contestants)కు 30 తులాల బంగారం (Gold) ఇచ్చారనేది అబద్ధం. 30 తులాలు కాదు, 3 గ్రామాలు కూడా ఇవ్వలేదు అని అన్నారు.