టీ న్యూస్ గోల్డెన్ ప్రాపర్టీ షోను ప్రారంభించనున్న మంత్రి హరీష్‌రావు

రియల్ ఎస్టేట్ రంగంపై టీ న్యూస్ మార్చి 13,14 తేదీల్లో హైదరాబాద్‌లోని హైటెక్స్ ఎగ్జిబిషన్స్‌లో ఏర్పాటు చేసిన గోల్డెన్ ప్రాపర్టీ షో 2021ను రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్‌రావు ప్రారంభిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అపర్ణ కన్‌స్ట్రక్షన్స్, వాసవీ గ్రూపు సమర్పణలో మై హోమ్ గ్రూపు భాగస్వామ్యంతో టీ న్యూస్ ఈ ప్రాపర్టీ షోను సమర్పిస్తోంది. ఈ షోలో దాదాపు 55కిపైగా కంపెనీలు తమ స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. ఈ ప్రాపర్టీ షోకి ప్రవేశం ఉచితమేనని ఉదయం 10 గంటల నుంచి రాత్రి 7 వరకు ఈ షో జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.