హైదరాబాద్ మెట్రోకు మరో గౌరవం.. స్టాన్ ఫోర్డ్ లో

హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టుకు మరో గౌరవం దక్కింది. ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయ మేనేజ్‌మెంట్ ప్రాక్టీషనర్లు, విద్యార్థులకు ఈ ప్రాజెక్టు కేస్ స్టడీగా మారింది. ప్రాజెక్టు విజయగాథను సాన్ట్‌ఫోర్డ్ సోషల్ ఇన్నోవేషన్ రివ్యూ (ఎస్‌ఎస్‌ఐఆర్) తాజా సంచిక ( స్ప్రింగ్-2024)లో ప్రచురించింది. ఇది ఒక భారతీయ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టుకు దక్కిన అరుదైన గౌరవంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) అభివర్ణించింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టిన మొదటి దశ మెట్రో రైల్ ప్రాజెక్టు విజయవంతం కావడంతో హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఆయన బృందం అసాధారణ నాయకత్వ ప్రతిభను కనబరిచారని అధ్యయనంలో పేర్కొన్నారు.