Revanth Reddy : సీఎం రేవంత్‌రెడ్డితో మీనాక్షి నటరాజన్ భేటీ

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy ) తో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) , పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) భేటీ అయ్యారు. జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పార్టీ నిర్మాణం, పాదయాత్ర, బీసీ రిజర్వేషన్ (BC Reservation) లపై ఢల్లీిలో పోరాడేందుకు కార్యాచరణపై చర్చించారు. ఈ నెల 31 నుంచి వచ్చే 4 వరకు యథావిధిగా కాంగ్రెస్ పాదయాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. ఆగస్టు 5, 6, 7 తేదీల్లో 42 శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదానికి ఢల్లీిలో చేపట్టాల్సిన కార్యాచరణ వీరి మధ్య చర్చకు వచ్చింది. ఆగస్టు 5న పార్లమెంటు ఉభయ సభల్లో ఎంపీల వాయిదా తీర్మానం, చర్చకు పట్టుబట్టాలని నిర్ణయించారు.
ఆగస్టు 6న జంతర్ మంతర్ (Jantar Mantar) వద్ద నిర్వహించే ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నేతలు, బీసీ సంఘాల నేతలు పాల్గొననున్నారు. 7న రాష్ట్రపతిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. ప్రత్యేక రైలులో ప్రతి నియోజకవర్గం నుంచి 50 మంది నేతలు కార్యకర్తలు ఢల్లీికి వెళ్లనున్నారు. ఢల్లీి పర్యటన అనంతరం కాంగ్రెస్ పాదయాత్ర యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు.