Malreddy Rangareddy: మంత్రి పదవి ఇచ్చే అధికారం సీఎంకు లేదు: మల్‌రెడ్డి రంగారెడ్డి

తనకు మంత్రి పదవి ఇవ్వాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఉన్నప్పటికీ, ఆయన చేతిలో అధికారం లేదని, ఢిల్లీ నుండి ఆదేశాలు రావాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి (Malreddy Rangareddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి పదవులను కేటాయించే అధికారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతిలో లేదని, ఈ నిర్ణయాలు పార్టీ అధిష్ఠానం ఢిల్లీలో తీసుకుంటోందని ఆయన అన్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వాలని ముఖ్యమంత్రికి ఉందని, కానీ ఆయన ఇవ్వలేకపోతున్నారని మల్‌రెడ్డి రంగారెడ్డి (Malreddy Rangareddy) చెప్పారు. అలాగే విజయశాంతి ఢిల్లీకి వెళ్లి ఎమ్మెల్సీ పదవిని తెచ్చుకున్నారని ఆయన ఆరోపించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో సంచలనం రేపాయి. తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎన్నికైన వారిలో విజయశాంతి కూడా ఉన్న సంగతి తెలిసిందే. కొన్నిరోజుల క్రితం కూడా మల్‌రెడ్డి రంగారెడ్డి (Malreddy Rangareddy) ఇలాగే షాకింగ్ వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి తాను ఒక్కడినేనని, కాబట్టి తనకు కచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తనకు మంత్రి పదవి ఇవ్వకపోతే, వచ్చే ఎన్నికల్లో వేరే పార్టీ అభ్యర్థులను తానే గెలిపిస్తానని వార్నింగ్ ఇచ్చారు.