ఆస్ట్రేలియాలో మల్లారెడ్డి విద్యాసంస్థలు

నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో మల్లారెడ్డి గ్రూప్ విద్యాసంస్థలను ఆస్ట్రేలియాలో నెలకొల్పనున్నట్లు మల్లారెడ్డి గ్రూప్ చైర్మన్, తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. ఈ మేరకు విక్టోరియా పార్లమెంట్‌లో ఆ దేశపు మంత్రులతో మల్లారెడ్డి చర్చలు జరిపారు. మల్లారెడ్డి గ్రూప్ అనుభవంతో, ఆస్ట్రేలియాలో అక్కడి విద్యార్థులకు జాబ్ రెడీ స్కిల్స్‌ను అందించడానికి, ఆస్ట్రేలియా విద్యావ్యవస్థలో మార్పులు తీసుకురానున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యంగా డెంటల్, నర్సింగ్, కన్‌స్ట్రక్షన్ రంగాలపై దృష్టి సారిస్తామన్నారు. ఈ సమావేశంలో మల్లారెడ్డి గ్రూప్ చైర్మన్ మల్లారెడ్డితో పాటు మెల్‌బోర్న్‌లోని ఎక్సెల్ గ్లోబల్ డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్, విక్టోరియన్ మంత్రులు అన్వర్ ఎడ్గోయెన్, నాటలీ హచిన్సన్ తదితరులు పాల్గొన్నారు.