Revanth: తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్పై సీఎంకు ఖర్గే, ప్రియాంక అభినందనలు
ఢిల్లీ: తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డిని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ అభినందనలు తెలిపారు. తెలంగాణ భవిష్యత్ ముఖచిత్రాన్ని డాక్యుమెంట్ ఆవిష్కరించిందని వారు పేర్కొన్నారు. ఢిల్లీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీలను వారి నివాసాల్లో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ విజయవంతమైన తీరు, తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణపై వారి మధ్య చర్చ కొనసాగింది. సమ్మిట్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబట్టేందుకు ఒప్పందాలు చేసుకోవడంపై అగ్ర నేతలు సీఎంను ప్రశంసించారు. సీఎం వెంట మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీలు సురేశ్ షెట్కార్, మందాడి అనిల్ కుమార్, పోరిక బలరాం నాయక్, డాక్టర్ మల్లు రవి, కుందూరు రఘువీర్ రెడ్డి, గడ్డం వంశీకృష్ణ ఉన్నారు.






