తెలంగాణలో మరో సంస్థ భారీ పెట్టుబడి
జ్యువెలరీ రంగంలో అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గడిరచిన దేశీయ దిగ్గజయం మలబార్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చింది. రాష్ట్ర మంత్రి కేటీఆర్‌తో మలబార్ గ్రూప్ అధినేత ఎం.పి అహ్మద్‌తో కూడిన సీనియర్ ప్రతినిధుల బృందం సమావేశమై ఈ మేరకు తన నిర్ణయాన్ని వెల్లడిరచింది. తెలంగాణలో ఉన్న వ్యాపార అనుకూలతలతో పాటు తమ కంపెనీకి అవసరమైన నాణ్యమైన మానవ వనరులు ఉన్నాయని మలబార్ గ్రూప్ తెలిపింది. తమ గ్రూప్స్‌కు అంతర్జాతీయంగా 260 స్టోర్స్ ఉన్నాయని, తెలంగాణలో తాము ప్రతిపాదిస్తున్న పెట్టుబడి ద్వారా తమ కంపెనీ జ్యువెలరీ మాన్యుఫాక్చరింగ్ విభాగం మరింత బలోపేతం అవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. మొత్తం రూ.750 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో పెట్టనున్నట్లు, ఈ పెట్టుబడి ద్వారా గోల్డ్, డైమండ్ జ్యువెలరీ తయారీ ఫ్యాక్టరీ, గోల్డ్ రిఫైనరీ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. తమ పెట్టుబడితో సుమారు 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని మలబార్ గ్రూప్ తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వము ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను దృష్టిలో ఉంచుకొని, ఇక్కడున్న వ్యాపార అనుకూలతలను పరిగణనలోకి తీసుకొని పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చిన మలబార్ గ్రూప్‌కు మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ పెట్టుబడి ద్వారా 2500 మంది నైపుణ్యం కలిగిన స్వర్ణకారులకు ఉపాధి అవకాశాలు లభించడం అత్యంత సంతోషాన్ని ఇచ్చే విషయమని కేటీఆర్ పేర్కొన్నారు. మలబార్ గ్రూప్ తమ పెట్టుబడికి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలను ప్రభుత్వం వైపు నుంచి అందిస్తామని హామీ ఇచ్చారు.






