మా ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో… ప్రభుత్వం కూలిపోతుంది

తమ ఎమ్మెల్యేల్లో ఒక్కరిని ముట్టుకున్నా 48 గంటల్లో ప్రభుత్వం కూలిపోతుందని గుర్తు పెట్టుకోవాలని బీజేపీ శాసనభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారని ఆరోపించారు. 8 మంది బీజేపీ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని అంటున్నారు. అసలు మీ తమ్ముడు మీతో టచ్‌లో ఉన్నారో లేదో తెలుసుకోవాలని మంత్రిని ఉద్దేశించి అన్నారు. వెంకట్ రెడ్డితో పాటు ఐదుగురు మంత్రులు బీజేపీ అధిష్ఠానంతో టచ్‌లో ఉన్నారని తెలిపారు. భువనగిరి ఎంపీ సీటును 2 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. టెలిఫోన్ యాక్ట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినదని, ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐకి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేక కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తోందని విమర్శించారు.