Mahesh Kumar Goud: ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణలో పాలన

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ధీమా వ్యక్తం చేశారు. బనకచర్ల విషయంలో హరీశ్‌రావు (Harish Rao) అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకే తెలంగాణలో పాలన జరుగుతోందని వివరించారు. అంతకుముందు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పలువురు నేతలు కాంగ్రెస్‌లో చేరారు. ఎంపీ అనిల్ కుమార్ (Anil Kumar) ఆధ్వర్యంలో మురళీగౌడ్(Murali Goud), సంజయ్ గౌడ్ (Sanjay Goud) పార్టీలో చేరారు. వారికి మహేశ్‌కుమార్ గౌడ్ కండువా కప్పి ఆహ్వానించారు.