Mahesh Kumar Goud : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం : మహేశ్‌కుమార్ గౌడ్

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025`26 లో తెలంగాణకు ఇచ్చింది సున్నా అని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ కోడలు అయి ఉండి కూడా నిర్మలమ్మ (Nirmalamma )తెలంగాణపై ప్రేమ చూపలేదన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి తీరని అన్యాయం జరిగిందిన అసహనం వ్యక్తం చేశారు. బీజేపీ (BJP) తెలంగాణపై వివక్ష చూపిస్తోందని, రాజకీయంగా రాష్ట్రాన్ని దెబ్బతీయాలని చూస్తోందని ఆరోపించారు. త్వరలో బిహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో అక్కడ రాజకీయ లబ్ధి కోసం బీజేపీ కేంద్ర బడ్జెట్‌ను ఉపయోగించుకంటోందని మండిపడ్డారు. తెలంగాణకు ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ(Modi), బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy), ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రులు, ఎంపీలు, కేంద్ర మంత్రులను, ప్రధాన మంత్రిని కలిసి తెలంగాణకు రావాల్సిన అనేక అంశాలపై విజ్ఞప్తి చేసినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా కేంద్రం తెలంగాణకు అవసరమైన అంశాల్లో సహకారాన్ని అందించాలని కోరారు.