Mahesh Kumar Goud: అప్పటినుంచి ఇప్పటివరకు అవి ప్రభుత్వ భూములే : మహేశ్‌కుమార్ గౌడ్

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ( హెచ్‌సీయూ) భూములను తెలంగాణ ప్రభుత్వం లాక్కోవడం లేదని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. గాంధీ భవన్ (Gandhi Bhavan) లో ఆయన మీడియాతో మాట్లాడుతూ హెచ్‌సీయూ (HCU) భూములకు బదులుగా ఎప్పుడో ప్రభుత్వ భూములు ఇవ్వడం జరిగిందన్నారు. అప్పటినుంచి ఇప్పటివరకు అవి ప్రభుత్వ భూములేనని తేల్చి చెప్పారు. ఇప్పటివరకు కోర్టు కేసు ఉన్నందువల్ల ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం (State Government) స్వాధీనం చేసుకోలేదన్నారు. కోర్టు కేసు అయిపోయినందున భూములను స్వాధీనం చేసుకుంటామని వెల్లడించారు.