Mahesh Kumar Goud: దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా.. తెలంగాణలో : మహేష్‌కుమార్ గౌడ్

బీఆర్‌ఎస్ నేతలు కేసీఆర్, హరీశ్‌రావు గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ తో చేసుకున్న ఒప్పందాల కారణంగానే బనకచర్ల ప్రాజెక్టు తెరపైకి వచ్చిందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. సంగారెడ్డి జిల్లాలో రెండో రోజు జనహిత పాదయాత్ర కొనసాగింది. ఈ సందర్భంగా మహేశ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణకు రావాల్సిన నీటి వాటాను కాపాడటమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 42 శాతం బీసీల రిజర్వేషన్‌తో కవితకు ఎలాంటి సంబంధం లేదని అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ప్రవేశపెట్టి, దాన్ని అవలంభించిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని చెప్పారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా కులసర్వే జరిగింది తెలంగాణలో మాత్రమేనన్నారు. పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కారణంగానే అది సాధ్యమైందని పేర్కొన్నారు.