Mahesh Kumar Goud : క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు : మహేశ్‌కుమార్ గౌడ్
స్వాతంత్య్ర పోరాటంలో క్విట్ ఇండియా ఉద్యమం కీలకమైందని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అన్నారు. క్విట్ ఇండియా (Quit India) దినోత్సవం సందర్భంగా గాంధీభవన్‌లో జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డూ ఆర్ డై నినాదంతో గాంధీ (Gandhi) క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభించారన్నారు. కాంగ్రెస్ చరిత్రను తుడిచేయాలని బీజేపీ చూస్తోందని ఆరోపించారు. రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తోందన్నారు. రాజ్యాంగ సంస్థలతో ప్రతిపక్షాలపై కుట్రపూరిత దాడి చేస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్నికల కమిషన్ బీజేపీకి అనుబంధ సంస్థగా మారింది. ప్రశ్నిస్తే దేశద్రోహులని ముద్ర వేస్తున్నారు. క్విట్ బీజేపీ అంటేనే దేశానికి భవిష్యత్తు. కాంగ్రెస్ పార్టీ (Congress Party) దేశ రక్షణ కోసం పనిచేస్తోంది. బీజేపీ కులాలు, మతాల పేరిట భవిష్యత్తు లేకుండా చేస్తోంది. దేశ స్వాతంత్య్ర ఉద్యమంలో ఒక్క బీజేపీ (BJP) , ఆర్ఎస్ఎస్ నాయకుడు లేడు అని అన్నారు.







